language
english

అవార్డ్ కోసం స్కాచ్ పంపారు, నంది అవార్డులంటే కులాన్ని బట్టి ఇస్తారా?: చంటి అడ్డాల

నంది అవార్డ్స్ రచ్చ ఏ రెంజి లో టాలీవుడ్ ని ఊపేస్తోంది. ఏపీ ప్రభుత్వం ఏ ముహుర్తాన నంది అవార్డులను ప్ర క టించిందో కానీ సినీ రాజ కీయ వ ర్గాల్లో పెద్ద దుమార మే చెల రేగుతోంది. ఇప్ప టికే ప లువురు తెలుగు సినీ ప్ర ముఖులు నంది అవార్డు పై బ హిరంగంగానే అసంతృప్తిని తెలియ ప ర్చారు. నంది అవార్డుల ఎంపిక లో మొత్తం ఒకే సామాజిక వ ర్గానికి ప్రాధాన్య త ఇచ్చార ని.. నంది అవార్డ్స్ క మెటీ పై సినీ వ ర్గీయులు పెద వి విరుస్తున్నారు. ఇక డైరెక్ట ర్ రామ్ గోపాల్ వ ర్మ కూడా నంది అవార్డ్స్ ఇచ్చిన క మిటీ పై వ్యంగంగా స్పందిచిన విష యం తెలిసిందే. వచ్చిన అవార్డుల విషయంలో పక్షపాత ధోరణి చూపించారంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి.. ఇక ఆ క్రమం లో పాత విషయాలని కూడా బయటపెడుతున్నారు గతంలో జ్యూరీ మెంబర్లుగా ఉన్నవాళ్ళ అనుభవాలు ఒక్కొక్కటే బయటికి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించిన విధానం, జ్యూరీ తంతు చూస్తుంటే వార్ వన్ సైడ్ అన్నట్లే కనిపిస్తోంది. మంచి సినిమాలకు అన్యాయం జరిగిందనే బాధ కలిగింది. మూడేళ్ల అవార్డులు ప్రకటించిన తీరు చూస్తుంటే ముందుగా ఎంపిక చేసిన సినిమాల లిస్టును ముఖ్యమంత్రికి సమర్పించినట్లు అర్థమవుతోంది అని నిర్మాత చంటి అడ్డాల విమర్శించారు. ఇంకా మాట్లాడుతూ మనం వంటి కుటుంబ కథాచిత్రం, రుద్రమదేవి వంటి చారిత్రాత్మక సినిమా, రేసుగుర్రం లాంటి కమర్షియల్ సినిమాతో పాటు ఎన్నో హిట్ సినిమాలున్నాయి. అవార్డు తీసుకునే అర్హత వీటిలో దేనికీ లేదా? సెలక్షన్ కమిటీ మన చేతిలో ఉంది కదా అని ఇష్టమొచ్చిన సినిమాలను ఎంపిక చేసి అవార్డులిచ్చేస్తే సినిమాలు తీయడమెందుకు? అవార్డుల ఎంపిక సమయంలో జ్యూరీలో తెలిసిన వ్యక్తిగానీ, ప్రభుత్వ పరిచయాలుగానీ, రెకమెండేషన్ గానీ ఉండాలా? అనిపిస్తోంది. ఇకపైనా ఇలాగే కొనసాగితే నంది అవార్డు వృథా అనుకోవచ్చు. 2013 సంవత్సరంలో నేను జ్యూరీ సభ్యుడిగా ఉన్నప్పుడు ఓ పెద్దమనిషి మా ఇంటికి స్కాచ్ బాటిల్ పంపించాడు. అంటే బాటిల్ తీసుకొని అతడి సినిమాను అవార్డుల ఎంపిక విషయంలో పాజిటివ్ ఉండాలనేది ఆయన భావన కావచ్చు. జ్యూరీ సభ్యుల మొదటి మీటింగ్ తరువాత రెండో మీటింగ్ కు వెళ్లలేదు. నేను తరువాత జరిగిన మీటింగ్ కు కూడా వెళ్లకుండా వదిలేశాను. నంది అవార్డులంటే కులాన్ని బట్టి ఇస్తారా? లేక ఎవరి ప్రభుత్వం ఉంటే వారి సన్నిహితులకు ఇస్తారా? టాలెంట్ ను బట్టి ఇస్తారా? అనే విషయాలు అర్థం కావడం లేదు. మూడు సంవత్సరాల తర్వాత ప్రకటించిన ఈ అవార్డులకు సంబంధించిన లిస్ట్ ముందే తయారు చేశారా? లేక సినిమాలు చూసి అవార్డుల కోసం లిస్ట్ తయారు చేశారో అర్థం కాని పరిస్థితులున్నాయి. ఒకసారి ప్రేమ సినిమాకు బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గా నాకు వచ్చిన అవార్డును ప్రకటించి వెనకకు తీసుకున్నారు. ఎలాంటి కారణాలతో ఈ అవార్డు వెనక్కు తీసుకుంటారని ప్రశ్నించారు.

Comments

comments

Movie News
Telugu News