language
english

ఆ మాటలు గుర్తొచ్చాయి.. తండ్రిని తలుచుకొని నాగ్ ఉద్వేగం.. పాత వర్మను చూస్తారు..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శివ తర్వాత మళ్లీ రాంగోపాల్ వర్మ, నాగార్జున కలయికలో ఓ క్రేజీ కాంబినేషన్ తో సినిమా మొదలైంది. ఈ రోజు (నవంబర్ 20 తేదీన) అన్నపూర్ణ స్టూడియోలో వర్మ, నాగ్ సినిమా ఆరంభమైంది. ఈ చిత్రానికి వర్మ తల్లి తొలి షాట్ క్లాప్ కొట్టారు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన చెప్పకపోయినా నీవు చావడం మాత్రం ఖాయం. త్వరగా సమాధానం చెప్పి ముందు చస్తావో.. ఎక్కువ బాధపడి లేటుగా చస్తావో అది నీ ఇష్టం. ఏది కావాలో ఎంచుకో (చూస్) అని నాగార్జున ముహూర్తం షాట్ కు డైలాగ్ చెప్పారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో వర్మ, నాగార్జున మాట్లాడారు. ఈ సందర్భంగా నాగార్జున ఎమోషనల్ అయ్యారు. నాగార్జున చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. నాకు మైండ్ దొబ్బలే. నా మైండ్ బాగానే ఉంది. నేను ఎప్పుడూ ఓ ఎక్సైట్ మెంట్ కోసం ఎదురు చూస్తాను. ఆ ఎక్సైట్ మెంట్ ఈ రోజు మళ్లీ కనిపించింది. షూటింగ్ వెళ్లాలి అనే ఆతృత నాలో పెరిగింది. ఉదయం 4 గంటలకే లేచాను. లేచిన తర్వాత షూటింగ్ వెళ్లాలని త్వరగా తయారయ్యాను. రోజు ఇలా ఉంటే ఎంత బాగుండునో అని నాగార్జున అన్నారు. సినిమా హిట్ అవుతుందా.. హిట్ కాదా అనే విషయాన్ని శివ సమయంలో పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా పట్టించుకోవడం లేదు. కేవలం నా మీద వర్మకు, వర్మ మీద నాకు ఉన్న నమ్మకం మీదే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాన్నగారు చెప్పిన మాటలు విషయం గుర్తించాయి. ఒక ఆర్టిస్టుగానీ మనిషికి గానీ 28 ఏళ్ల తర్వాతే పరిణతి వస్తుంది అని నాన్న చెప్పారు. 28 ఏళ్ల వయసులోనే నాకు శివ లాంటి హిట్ వచ్చింది. మళ్లీ 28 ఏళ్ల తర్వాత వర్మతో సినిమా చేస్తున్నాను. ఈ సారి డబుల్ మెచ్యురిటీ వచ్చింది అనుకొంటున్నాను. ఈ సినిమా శివ కంటే పెద్ద హిట్ అవుతుంది అని నాగార్జున అన్నారు. వర్మకు నాకు ఉన్న అనుబంధం సినిమా రిలేషన్ కాదు. వర్మ తల్లిదండ్రులతో నాకు గొప్ప అనుబంధం ఉంది. నాకు మూడేళ్ల వయసులో రాము ద్దమ్మ నన్ను ఎత్తుకొని ఆడించింది. మేము స్టార్లుగా తయారు కాలేదు. స్టార్లుగా మమ్మల్ని తయారు చేయలేదు. మేమే పుట్టడమే ఆకాశం నుంచి స్టార్లుగా కిందకు వచ్చాం. రాముతో ప్రస్తుతం చేస్తున్న సినిమా చాలా విభిన్నమైన కథ. రాము మాఫియా సినిమాలు, యాక్షన్ సినిమాలు తీస్తారు. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఆ కథ చాలా ఇన్ స్పైరింగ్ ఉంది. ఒక విషయాన్ని నమ్మితే ఎంతకైనా తెగించే పాత్ర ఈ సినిమాలో దొరికింది. రాములో తపన చూస్తుంటే చాలా ఆశ్చర్యమేస్తున్నది. ఈ సినిమా కోసం రాము పనిచేస్తున్న విషయం చూస్తే మళ్లీ పాత వర్మ కనిపిస్తున్నాడు. శివ కంటే అద్భుతమైన సినిమా తీసి పెడుతాను అని రాము మాట ఇచ్చాడు. సరైన సమయంలో ఈ సినిమా చేస్తున్నాం.

Comments

comments

Movie News
Telugu News