language
english

నా నిజమైన హీరో అతనే.. పవన్ కల్యాణ్‌ షాకింగ్ ట్వీట్.. ఇంతకు ఆయన ఎవరో తెలుసా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏ మాట్లాడినా.. సోషల్ మీడియాలో ఏదైనా అంశాన్ని ప్రస్తావించినా ఆలోచించే విధంగా ఉంటాయి. ఎప్పుడూ ప్రజల మంచి గురించే ఆలోచించే నటీనటుల్లో పవన్ ఒకరు. తాజాగా హీరో అనే పదానికి నిర్వచనం చెబుతూ మై ఎవ్రీ డే హీరో అంటూ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. నా హీరో హకీం పేరును ప్రస్తావిస్తూ.. ఫొటోను పోస్ట్ చేశాడు. ఇంతకీ ఎవరీ హకీం అంటే.. ఇతరులకు సేవను అందించాలనే ఆకాంక్షతో సమైక్యతభావం ఉన్న వ్యక్తే ఎవ్రీ డే హీరో. నేను అలాంటి వారినే ఆరాధిస్తాను. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిజాయితీగా వ్యవహరిస్తారో వారే నిజమైన హీరో. జీవితంలో ఎన్నో సమస్యల్లో ఉండి కూడా ఇతరులను మంచి మార్గంలో నడిపిస్తారో.. మంచి చేయాలని మార్గదర్శకుడిగా ఉంటారో వారే నిజమైన హీరో. నా దృష్టిలో నాకు నిజమైన హీరో హకీం. అతను బంగ్లాదేశ్ జాతీయుడు. ఏన్నో ఏళ్ల క్రితం ఆయన కుటుంబ సభ్యులు లండన్ లో స్థిరపడ్డారు. నేను ప్రతీసారి లండన్ కు వెళ్లినపుడు ప్రత్యేక విమానంలో నన్ను తిప్పుతాడు. గతంలో చాలాసార్లు కలిసినప్పుడు మర్యాదపూర్వకంగా మాట్లాడుకునే వాళ్లం. గ్రీటింగ్స్ చెప్పుకొనే వాళ్లం. కానీ ఇటీవల లండన్ లో ఉండగా, రాజకీయ ప్రయాణం గురించి నాకు కొన్ని సలహాలు ఇచ్చారు. అవేమిటంటే.. మహిళల భద్రత, గృహ హింస లాంటి వాటిని నేను ఎన్నడూ మరిచిపోను. సీనియర్ సిటిజన్లను ఎన్నడూ విస్మరించను. మీరు కూడా ఇలాంటి విషయాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి అని హకీం సూచించాడు అని పవన్ ట్వీట్ చేశాడు. హకీం చేసిన సూచనలను, సలహాలను తుచ తప్పకుండా పాటిస్తాను అని పవన్ పేర్కొనడం విశేషం. పవన్ చేసిన ట్వీట్ కు సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తున్నది. గాంధీ గురించి హకీం చెప్పిన ఓ విషయం తనను కదిలించింది. తాను ముస్లిం కావడంతో ఇటీవల ఆయన మక్కా మసీదును దర్శించారు. ఏ మతమైనా హింసను ప్రోత్సహించ కూడదని ఆయన చెప్పారు. నిజాలు చెప్పే వ్యక్తులు తనకు గురువులతో సమానం అని పవన్ కల్యాణ్ మరో ట్వీట్ లో పేర్కొన్నారు. లండన్ లో జరిగిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ కార్యక్రమంలో ఐఈబీఎఫ్ అనే అవార్డును పవన్ కల్యాణ్ స్వీకరించిన సంగతి తెలిసిందే. అవార్డు స్వీకరించిన తర్వాత పవన్ సోమవారం ఉదయం హైదరాబాద్ కు తిరిగివచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో భారీ మొత్తంలో ఘన స్వాగతం పలుకడం ఇదే తొలిసారి. ఈ సారి ఎయిర్ పోర్ట్ లో భారీగా జనసేన జెండాలు రెపరెపలాడటం గమనార్హం. ఈ స్వాగత కార్యక్రమంలో మీడియా కూడా హంగామా చేసింది.

Comments

comments

Movie News
Telugu News