language
english

నా పేరుతో చాటింగ్ చేస్తున్నారు, చాలా అప్సెట్ అయ్యాను: సింగర్ సునిత

టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ నేరాల సంఖ్యాపెరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఎంట్రీ మొదలైన దగ్గర్నుంచీ ఇక ఫేకు రాయుళ్ళు కూడా మొదలయ్యారు ఎవరో ఒకరు ప్రముఖుల పేరుతో అకౌంట్ ఓపెంచేయటం మామూలైపోయింది. సాధారణం గా ఇలాంటి ఫేక్ అకౌంట్లతో ఫాలోవర్స్ ని పెంచి ఆ తర్వాత తమ సంస్థల అడ్వర్టైజ్మెంట్ కోసం వాడుకుంటారు. అక్కడి వరకూ పర్వాలేదు గానీ… సెలబ్రిటీ ఒరిజినల్ అకౌంట్ ఏమో అని నమ్మేసినవాళ్ళని మోసం చేసే అవకాశం కూడా ఉంది. తన పేరు మీద ఫేస్ బుక్ లో ఎవరెవరో అకౌంట్స్ ఓపెన్ చేశారని…. అలాంటి ఫేక్ ప్రొఫైల్స్ ని ఎంకరేజ్ చేయవద్దని టాలీవుడ్ సింగర్ సునీత చెప్పింది. ఇప్పుడు సింగర్ సునిత కి ఇదే సమస్య వచ్చిందట. ఆమెకి స్వంతంగా ఒక ఎఫ్బీ పేజీ ఉంది అయితే సింగర్ సునితా పేరుతో కొన్ని గ్రూపులూ, మరికొన్ని పేజీలూ, అకౌంట్లూ కనిపించటం వాటికి తనఫొటో వాడుతూండటం తో ఎక్కడ తన పేరుని మిస్ యూజ్ చేస్తారో అని భయం వేసిందో ఏమో గానీ అలాంటి అకౌంట్లని నమ్మవద్దని అభిమానులని హెచ్చరించింది. ఫేక్ అకౌంట్ల ద్వారా వారంతా వీలైనంత ఎక్కువ మందితో టచ్ లో ఉన్నారని… ఈ వ్యవహారంతో తాను చాలా అప్ సెట్ అయ్యాయని ఆమె ఆందోళన పడింది. ఫేక్ వాట్సాప్ అకౌంట్ ద్వారా కూడా వారు మెసేజింగ్, చాటింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఫేస్ బుక్ లో తనకు ఒకే అకౌంట్ ఉందని… దానికి బ్లూ కలర్ టిక్ ఉంటుందని… ఆ టిక్ ను చూసి తనను ఫాలో కావాలని సూచించారు. ఈ ఫేక్ అకౌంట్ గాళ్లంతా తన పేరును, తన పరపతిని పాడు చేస్తున్నారని మండిపడింది. అలాంటి ఫేక్ అకౌంట్లను తాను ఇక్కడ రెండింటిని పోస్ట్ చేస్తున్నానని… ఇలాంటి అకౌంట్లు చాలా ఉన్నాయని, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయవద్దని కోరారు.

Comments

comments

Movie News
Telugu News