language
english

Movie Reviews

Date:November 20, 2017

రేటింగ్ : 2.75టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకొన్న నటుడు శివ బాలాజీ. ఇటీవల కాలంలో కాటమరాయుడు చిత్రంలో పోషించిన పాత్రకు మంచి పేరు వచ్చింది. తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో విజేతగా నిలువడంతో మరింత క్రేజ్ వచ్చింది.బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన తర్వాత స్వీయ నిర్మాణ సారథ్యంలో స్నేహమేరా జీవితం సినిమాను తెరక్కెక్కించాడు. మల్టీ స్టారర్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో శివబాలాజీ తో రాజీవ్ కనకాల ఓ …

 
Date:November 17, 2017

టాలీవుడ్ లో భలే భలే మొగాడివోయ్, మహానుభావుడు లాంటి సెన్సేషనల్ హిట్స్ తో దూసుకెళ్తున్న దర్శకుడు మారుతి. స్వయంగా దర్శకత్వం వహించడమే కాదు.. యువ దర్శకులను ప్రోత్సాహించడానికి నిర్మాతగా మారారు మారుతి. ఆ క్రమంలోనే వచ్చిన చిత్రం లండన్ బాబులు. ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించిన అండవన్ కట్టలై చిత్రానికి రీమేక్. ఈ చిత్రానికి బీ చిన్నకృష్ణ దర్శకత్వం వహించారు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు …

 
Date:

ఊపిరి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లోను మెప్పించారు తమిళ నటుడు కార్తీ. ఆ తర్వాత వచ్చిన చెలియా, అంతకుముందు వచ్చిన కాష్మోరా చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టులేకపోయాయి. ప్రస్తుతం మరోసారి పవర్ పోలీస్ ఆఫీసర్ గా కార్తీ ఖాకి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కార్తీకి జంటగా అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. వాస్తవ కథ ఆధారంగా చేసుకొని పరిశోధనాత్మక చిత్రంగా ఖాకి నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోలీస్ పాత్రలో కార్తీ …

 
Date:

దక్షిణాది చిత్ర పరిశ్రమలో లవర్ బాయ్, క్రేజీ హీరోగా పేరున్న సిద్ధార్థ్ గత కొద్దికాలంగా సక్సెస్ లకు దూరమయ్యాడు. దాదాపు తెరపైన కనుమరుగై పోతున్నాడా అనే దశలో స్వీయ నిర్మాణ సారథ్యంలో సిద్ధార్థ్ రూపొందించిన చిత్రం గృహం. తన ఇమేజ్ కు భిన్నంగా హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రం గృహంతో నవంబర్ 17న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గృహం చిత్రం సిద్ధార్థ్ కు మంచి సక్సెస్ ను అందించిందా? అసలు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది …

 
Date:November 10, 2017

మహానగర, శమంతకమణి, నక్షత్రం చిత్రాలతో ఆకట్టుకొంటున్న యువ హీరో సందీప్ కిషన్ తాజాగా నటించిన చిత్రం C/o సూర్య. తమిళ దర్శకుడు సుశీంద్రన్ రూపొందించిన ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన హీరోయిన్ గా మెహ్రీన్ పిర్జాదీ నటించింది. సస్సెన్స్ థ్రిల్లర్ కథాంశంతో చక్రీ చిగురుపాటి నిర్మించిన C/o సూర్య నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. ఓ పోలీస్ ఆఫీసర్ (నాగినీడు) కొడుకైన …

 
Date:

మన పక్కదేశం శ్రీలంకలో అక్కడి ప్రభుత్వానికి, తమిళ టైగర్లకు జరిగిన యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. అక్కడ బ్రతకలేని పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని భారత దేశం వైపు సముద్ర మార్గంలో వలస బాటపట్టిన శరణార్థులు ఎందరో. అలా బయల్దేరిన వారిలో సముద్రంలోనే సమాధి అయిన వారే ఎక్కువ.శరణార్థులుగా భారత దేశం చేరిన కొద్ది మంది ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అనే కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఒక్కడు మిగిలాడు చిత్రం తెరకెక్కించారు. మంచు మనోజ్ …

 
Date:November 9, 2017

తెలుగులో మంచు మనోజ్ నటించిన రాజుభాయ్ అనే చిత్రానికి కథను అందించిన తమిళ దర్శకుడు మిస్కిన్, తెలుగు ప్రేక్షకులకు పందెం కోడి లాంటి చిత్రాలతో రుచి చూపించిన విశాల్ కలిసి రూపొందించిన చిత్రం డిటెక్టివ్. తమిళంలో ముగమూడి లాంటి సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలను అందించిన తాజాగా అదే జోనర్ తో డిటెక్టివ్ చిత్రాన్నిరూపొందించారు. ఈ చిత్రం ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ఆర్థర్ కోనన్ డోయ్లే తీర్చిదిద్దిన షెర్లాక్ హోమ్స్ పాత్ర ఈ సినిమాకు ఇన్సిపిరేషన్. ఇలాంటి ప్రత్యేకతలు …

 
Date:

తెరీ చిత్రం తర్వాత దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో తమిళ సూపర్ స్టార్, ఇలయ దళపతి విజయ్ నటించిన చిత్రం అదిరింది. అదిరింది చిత్రంలో విజయ్ త్రిపాత్రాభినయం చేశారు. విజయ్ సరసన కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లు గా నటించారు. విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొన్న అదిరింది చిత్రం నవంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఇప్పటికే తమిళంలో మెర్సల్ పేరుతో విడుదలై సంచలన విజయం దిశగా దూసుకుపోతున్నది.తమిళనాడులో …

 
Date:November 3, 2017

ఇటీవల కాలంలో వరుస విజయాలను సొంతం చేసుకొంటున్న యువ తార హెబ్బా పటేల్, యువ హీరో నాగ అన్వేష్ నటించిన చిత్రం ఏంజెల్. ప్రముఖ దర్శకుడు రాజమౌళి వద్ద డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో శిక్షణ పొందిన పళని ఈ చిత్రానికి డైరక్టర్. గతంలో స్వర్గం నుంచి వచ్చిన దేవకన్య కథలకు ఏమాత్రం తీసిపోకుండా లేటెస్ట్ గా వండిన స్టోరీతో ఏంజెల్ రూపొందింది. భారీ బడ్జెట్, కంప్యూటర్స్ గ్రాఫిక్స్ కోసం ఎక్కువగానే ప్రచారం జరిగింది. స్వర్గం నుంచి …

 
Date:

టాలీవుడ్ లో కామెడీ, హారర్, థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకులు పెద్ద పీట వేస్తున్నారు. చిన్న చిత్రాలుగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకొన్న హారర్ కామెడీ చిత్రాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న చిత్రం నెక్ట్స్ నువ్వే. బుల్లితెర మీద మెగాస్టార్ గా పేరున్న ఈటీవీ ప్రభాకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఇంటర్వ్యూ : సుమన్ మరణం తీరని లోటు.. దేవుడు వేసిన శిక్ష.. అల్లు శిరీష్ దేవుడు.. ప్రభాకర్ ప్రభాకర్ తొలిసారి …

 
Date:

హీరో రాజశేఖర్ గురించి చెప్పుకోవడానికి ఈ మధ్య కాలంలో ఒక మంచి సినిమా అంటూ లేకుండా పోయింది. చాలా కాలం తర్వాత రాజశేఖర్ తన సత్తా నిరూపించుకుంటూ పిఎస్ వి గరుడ వేగ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు.గుంటూరు టాకీస్, చందమామ కథలు సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన పిఎస్ వి గరుడ వేగ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు …

 
Date:October 27, 2017

టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ గా పేరు సంపాదించుకొన్న రామ్ పోతినేని నటించిన చిత్రం ఉన్నది ఒకటే జిందగీ. నేను శైలజ, హైపర్ చిత్రాల తర్వాత వస్తున్న చిత్రమిది. మరో హిట్ ను కెరీర్ లో జమ చేసుకొనేందుకు రామ్ మళ్లీ నైను శైలజ దర్శకుడు కిషోర్ తిరుమలతో జతకట్టాడు. ఫ్రెండ్స్ షిప్ అంశాన్ని ప్రధానంగా చేసుకొని రూపొందించిన ప్రేమ కథా చిత్రం ఉన్నది ఒకటే జిందగీ. హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠితోపాటు యువ హీరో …

 
Movie News
Telugu News