language
english

గదిలోకి వస్తేనే హాజరు వేస్తాడట!: కీచక అధికారికి వార్నింగ్

కందుకూరు: విధులకు వచ్చినట్లు హాజరుపడాలంటే తన గదికి రావాల్సిందేనని కీచక పర్వానికి తెరదీసిన ప్రభుత్వ అధికారిపై పలువురు మహిళలు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆర్డీవో.. సదరు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరుమార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే.. కందుకూరు మున్సిపల్ శానిటరీ ఇన్ స్పెక్టర్ కొండయ్య లైంగిక వేధింపులు భరించలేకపోతున్నామని పలువురు మహిళా పారిశుద్ధ్య కార్మికులు ఆర్డీఓ మల్లిఖార్జున ఎదుట వాపోయారు. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్ సెల్ లో ఆయన్ను కలిసి ఫిర్యాదు చేశారు. గిట్టని మహిళలు, చెప్పినట్టు వినని మహిళలను లక్ష్యంగా చేసుకుని కొండయ్య వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తన గదికి రావాలంటూ తరుచూ బలవంతం చేస్తున్నాడని, వెళ్లకుంటే మస్టర్ వేయకుండా పనికి రానట్టు నమోదు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సహచర కార్మికుల వద్ద చులకనగా మాట్లాడుతూ.. వేధిస్తున్నాడని వాపోయారు. దీనిపై గతంలోనే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని, అయినా ఆ అధికారి వేధింపులు మాత్రం ఆపడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆర్డీఓ.. పద్ధతి మార్చుకోవాలని గతంలోనే శానిటరీ ఇన్ స్పెక్టర్ ను హెచ్చరించానని, మార్పు రాకుంటే ప్రభుత్వానికి ఆయన్ను సరెండర్ చేస్తానని హెచ్చరించారు. రెండు, మూడు రోజుల్లో మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి విచారిస్తానని హామీ ఇచ్చారు. సమావేశం ఎప్పుడు నిర్వహించేది కార్మికులకు తెలియజేస్తామని, ఆ రోజు వచ్చి తమ ఇబ్బందులు చెప్పాలని ఆర్డీఓ కార్మికులకు సూచించారు.

Comments

comments

Movie News
Telugu News