language
english

ధర్నాకు గైరాజర్: ఉమా మాధవరెడ్డి టిఆర్ఎస్‌లో చేరుతారా, ఆమె ఏం చెప్పారంటే?

నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని టిడిపి నేతల్లో మరోసారి విబేధాలు బహిర్గతమయ్యాయి. టిడిపిలో మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహ్ములు, ఉమా మాధవరెడ్డి వర్గాలకు మధ్య కొంత కాలంగా అంతరం నెలకొంది. సోమవారం నాడు నల్గొండ కలెక్టరేట్ వద్ద జరిగిన రైతుల ఆందోళన కార్యక్రమానికి ఉమా మాధవరెడ్డి హజరుకాలేదు.అయితే కొంత కాలంగా ఆమె పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది. అయితే గతంలో పలుమార్లు ఇతర పార్టీల నుండి చేరాలని ఆహ్వనాలు వచ్చినా తాను చేరలేదని చెప్పారు. అయితే టిఆర్ఎస్ నుండి ఆహ్వనం వస్తే ఆ పార్టీలో చేరే విషయాన్ని ఆలోచిస్తానని ప్రకటించడం కూడ ఆమె పార్టీ మారుతారనే సంకేతాలను ఇచ్చినట్టైదంటున్నారు విశ్లేషకులు.రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుండి స్పష్టమైన హమీ ఇచ్చినందునే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని, తనకు కాంగ్రెస్ పార్టీ నుండి ఇంతవరకు స్పష్టమైన హమీ రాలేదన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుండి స్పష్టమైన హమీ వస్తే రేవంత్ తో పాటే తాను కూడ రాహుల్ గాంధీని కలిసేందుకు వెళ్ళేదాన్నని ఆమె గుర్తు చేశారు.ఉమా మాధవరెడ్డి: టిఆర్ఎస్ కు నో చెప్పడానికి కారణమిదే, ఆలోచిస్తా2014 ఎన్నికల సమయంలోనే టిఆర్ఎస్ లో చేరాలని ఆహ్వనాలు వచ్చాయని కూడ ఉమా మాధవరెడ్డి చెప్పారు. కానీ, ఆనాడు టిడిపిని వదలలేదన్నారు. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ లో చేరాలని ఆహ్వనాలు వస్తే ఆలోచిస్తానని ఆమె తాజాగా ప్రకటించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. రైతులపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ నల్గొండ కలెక్టరేట్ ఎదుట నవంబర్ 20వ, తేదిన టిడిపి ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహ్ములు తదితర నేతలు పాల్గొన్నారు. అయితే ఈ ధర్నాకు మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి మాత్రం హజరుకాలేదు. అయితే పార్టీలో కొంతకాలంగా మాజీమంత్రులు మోత్కుపల్లి నర్సింహ్ములు, ఉమా మాధవరెడ్డి వర్గాలకు మధ్య అంతరం కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఉమా మాధవరెడ్డి వర్గీయులు ఈ ధర్నాకు హజరుకాలేదని ఆమె వర్గీయులు చెబుతున్నారు. అయితే ఆమె పార్టీ మారేందుకు సన్నాహలు చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ ధర్నాకు హజరుకాకపోవడం కూడ చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి తెలంగాణ సీఎం కెసిఆర్ ను అసెంబ్లీలోనే కలిశారు. మావోయిస్టుల చేతిలో మరణించిన కుటుంబాలకు ఇంటి స్థలం ఇవ్వాలని కోరుతూ ఆమె సీఎంకు వినతిపత్రం సమర్పించారు. ఆమె సీఎంను కలిసే సమయంలో టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడ ఉన్నారు. అయితే అదే సమయంలో నల్గొండ కలెక్టరేట్ వద్ద టిడిపి ధర్నాలో పాల్గొనకుండా ఉమా మాధవరెడ్డి సీఎంను కలిసేందుకు వెళ్ళారనే ప్రచారం కూడ జిల్లాలో సాగింది. అయితే ఈ ప్రచారాన్ని ఉమా మాధవరెడ్డి తీవ్రంగా ఖండించారు. పార్టీలోనే కొందరు నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోయారని సమాచారం. ఉమా మాధవరెడ్డి భువనగిరి నుండి 2003 నుండి ప్రాతినిథ్యం వహించారు. అయితే 2014 ఎన్నికల్లోనే ఆమె ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుతం భువనగిరి ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ అభ్యర్థి పైళ్ళ శేఖర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉమా మాధవరెడ్డి టిఆర్ఎస్ లో చేరితే ఆమెకు ఎక్కడ నుండి పోటీ చేసేందుకు అవకాశం కల్పించనుందోననే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇటీవల మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఇదే విషయాలను ఉమా మాధవరెడ్డి ప్రస్తావించారని అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం ప్రస్తుతం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ లేరు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరితే టిక్కెట్టు విషయమై స్పష్టత లేదంటున్నారు.ఈ కారణంగానే ఉమా మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటున్నారు.ఇదిలా ఉంటే వచ్చే నెలలో ఉమా మాధవరెడ్డి టిఆర్ఎస్ లో చేరుతారానే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ వార్తలను ఆమె ఖండిస్తున్నారు. టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి ఏం చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఆమె టిడిపిలోనే కొనసాగుతారా, ఇతర పార్టీల్లో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటారా అనే చర్చ సాగుతోంది. అయితే నల్గొండ కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాకు ఆమె గైరాజర్ కావడంపై కూడ పార్టీలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. అయితే గ్రూపు విబేధాల కారణంగానే ఉమా మాధవరెడ్డి ధర్నాకు హజరుకాలేదా ఇంకా ఇతరత్రా ఏమైనా కారణాలున్నాయా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

Comments

comments

Movie News
Telugu News