language
english

బంగారు నగల కోసం ప్రియురాలి తల నరికేశాడు, సహాయం చెయ్యలేదని కిరాతకం!

చెన్నై: బంగారు నగల కోసం ఆశపడిన ప్రియుడు అతని ప్రియురాలిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. ప్రియురాలిని హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న మారియప్పన్ అలియాస్ మారి (37) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.పోలీసుల కథనం మేరకు తమిళనాడులోని అంబత్తూరుకు చెందిన రేవతి అలియాస్ లక్ష్మీ (42), రామచంద్రన్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త రామచంద్రన్ తో విభేదాలు రావడంతో పదేళ్ల నుంచి రేవతి ముగ్గురు పిల్లలతో కలిసి ఒంటరిగా నివాసం ఉంటున్నది. తిరువళ్లూరుకు సమీపంలోని వేంపట్టుకు చెందిన మారియప్పన్ అలియాస్ మారి కొన్ని సంవత్సరాల నుంచి రేవతి ఇంటి ఎదురుగా కిరాణా దుకాణం నడిపేవాడు. రేవతి నిత్యం సరుకుల కోసం మారి షాప్ కు వెళ్లి వచ్చేది. ఇలా ఇద్దరి మధ్య స్నేహం పెరిగి అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈనెల 10వ తేదీన రేవతి మారి బైక్ లో వాలాజీలోని ధన్వంతరి ఆలయానికి వెళ్లారు. పూజలు అయిన తరువాత ఇద్దరూ బైక్ లో ఇంటికి బయలుదేరారు. మార్గం మధ్యలో తిరువాలాంగాడు సమీపంలోని లక్ష్మి విలాసపురం వద్ద ఆగారు. ఆ సందర్బంలో తాను వ్యాపారంలో నష్టపోయానని, ఆదుకోవాలని మారి తన ప్రియురాలు రేవతికి చెప్పాడు. ప్రియుడు మారికి ఆర్థిక సహాయం చెయ్యడానికి రేవతి నిరాకరించింది. ఆ సందర్బంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. మారి ముందుగా పథకం ప్రకారం వెంట తీసుకెళ్లిన కత్తి తీసుకుని రేవతి మెడ నరికేశాడు. ఆమె మెడలో ఉన్న ఆరు సవర్ల బంగారు నగలు, చెవి కమ్మలు లాక్కొన్నాడు. రేవతి తలను సమీపంలోని చెరువు కట్ట మీద విసిరి వేసిన మారి అక్కడి నుంచి పరారైనాడు. రేవతి కనపడలేదని కేసు నమోదు చేసిన పోలీసులు మారి మీద అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా ఆమెను హత్య చేసినట్లు అసలు విషయం అంగీకరించాడని పోలీసులు తెలిపారు. తండ్రి దూరం కావడం, తల్లి రేవతి హత్యకు గురి కావడంతో ఆమె ముగ్గురు పిల్లలు అనాథలు అయ్యారని పోలీసులు తెలిపారు. రేవతి మృతదేహం, తల స్వాధీనం చేసుకుని పోస్టుమార్టుం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని పోలీసులు చెప్పారు.

Comments

comments

Movie News
Telugu News