language
english

వారెవా.. ఏం ఐడియా! వివాహ ఆహ్వానం.. వినూత్నంగా..

రాజమహేంద్రవరం: వివాహ ఆహ్వాన పత్రికల ముద్రణలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ ఆహ్వానపత్రాలు ముద్రించేవారు కూడా స్నేహితుల కోసం వేరేగా మరికొన్ని కార్డులు ముద్రిస్తారు.రాజమహేంద్రవరంలోని సీతంపేటకు చెందిన ఏడిద వెంకటేశ్ తన కుమార్తె అషిత వివాహం సందర్భంగా ఆధునిక శైలిలో వివాహ ఆహ్వాన పత్రికలు ముద్రించారు. ఏటిఎం కార్డు సైజులో ముద్రించిన ఈ పత్రిక అందరినీ ఆకట్టుకుంటోంది.ఏటిఎం కార్డులో ఉండే చిప్ , కాల పరిమితి, కార్డు పేరు.. అన్నింటినీ ముద్రించి… దానిపై వధూవరుల పేర్లు ముద్రించడమేకాక, ఈ కార్డు కాల పరిమితి జీవితకాలమంటూ.. వాటికి తమదైన శైలిలో భాష్యం చెప్పారు.

Comments

comments

Movie News
Telugu News